ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా(సరస్వతీ మాత పద్యాలు):- - మమత ఐల హైదరాబాద్ 9247593432
 క.
సలలిత మగుశార్వానివి
పిలవగనే పలుకు జనని పృధ్విన నీవే
జలజలమన పారించెటి
సలలిత విజ్ఞాన మొసగు శాంభవివమ్మా!
క.
కరమున వీనను మీటుతు
వరముగ విద్యలనొసగెటి వరదాయినివే
ధరణిన వాసర నీదే
దరిజేరగవచ్చి నాము దయజూపమ్మా
క.
శరణము నీవే నంటిని
కరుణను జూపించునట్టి కాత్యాయినివే
చరణమ్మును నేవీడను
మరణము నొందేవరకును మంజులవాణీ
క.
బాసరనివాసి భారతి
వాసరపురమేలుజనని వరములనొసగన్ 
వ్రాసితి నీదయ తోడను
కాసింతయు కరుణజూప ఘన ముగగెలుతున్ 
క.
వీణాపుస్తక ధారిని
వాణీ మ్రొక్కెద మముగను వాసరమాతా!
రాణీనీదయతోడను
బాణీలుగవిద్యనొసగు పావనివమ్మా!కామెంట్‌లు