చమత్కార సీస పద్యం:-మమత ఐల-హైదరాబాద్-9247593432
లిప్స్టికక్కరలేదు లేదుకర్చులబాధ
        మూసివేయుటకీజి ముక్కు మూతి
పెదవులన్ రక్షించ పెట్టు మాస్కునెపుడు
           మృదువుగా కనిపించు మిక్కిలిగను
అద్దమక్కరలేదు లేదుహడావుడి
            సమయంబుదక్కులే చక్కగాను
రుద్ది రుద్ది పెదవి మొద్దు బారునొ యేమొ
           హంగుపోవు పెదవి రంగుతగిలి
ఆ.వె
న్యాచురల్ మెరుగుల నవ్వుమాస్కునదాగ
నెదిరిజూచెవారి నెపుడుచూడ
మస్తుమస్తుగుండు వాస్తవం బిదియేను
మనసు పెట్టి వినుము మమతమాట


కామెంట్‌లు