మా మంచి ఏనుగు:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్ నెంబర్.9491387977.-నాగర్ కర్నూలు జిల్లా
ఏనుగమ్మా ఏనుగు మా మంచి
కానుగు తోటలో మా ఈ ఏనుగు
మా వూళ్ళో ఎంచుకున్న ఏనుగు
మా వోళ్ళు పెంచుకున్న  ఏనుగు!

చిట్టి పొట్టి కన్నులతో ఈ ఏనుగు
దృష్టి పెట్టి చూస్తుంది మా ఏనుగు
మట్టిలో దాగిన గుండు సూది నైన
ఇట్టే పట్టి తాను తెస్తూంది బేగిన !

తొండంతో తోడుతుంది తా నీళ్ళు
పైనిండ పోసి తోముతుంది వళ్ళు
తుడుచుటకు తెస్తుంది తువాళ్ళు
ఏ పనికైనా చేస్తుందిలే సవాళ్ళు !

కొండవంటి వెలుగు ఒళ్ళుతో
స్తంభాలాంటి నాలుగు కాళ్ళతో
తాను పరుగు వెంటనే తీస్తుంది
తీయని చెరకు పంటనే మేస్తుంది!

బరువులు బాగా మోస్తుంది
చెరువులో స్నానం చేస్తుంది
తాపండూ ఫలమూ తెస్తుంది 
నిండు మనసుతో మా కిస్తుంది!

గుడి కాడికి తీసుకువెళ్తుంది
మడితో మము మొక్కి స్తుంది
తీర్థ ప్రసాదం తానందిస్తుంది
ఆశీర్వాదం తొండంతో అందిస్తుంది!

మా ఇంటికి తీసుకు వస్తుంది
అమ్మ నాన్నలకు చూపిస్తుంది
అభిరాముని ప్రతిమను ఇస్తుంది
అభివాదము వారికి చేస్తుంది...!


కామెంట్‌లు