కబర్దార్ ఓ కరోనా:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
కరోనా కరోనా కరోనా ఓ కరోనా
వద్దు వద్దు రా వద్దు ఓ కరోనా
బుద్ధి మార్చుకొని వెళ్ళిపో కరోనా
సద్దు మనిగి పోవాలి సరేనా కరోనా

కరోనా కరోనా కరోనా ఓ కరోనా
మా దేశం రావద్దు నీవు కరోనా
మా సందేశం ఆలకించు కరోనా
నీ ఆవేశం ఒలికించి ఓ కరోనా
ఈ దేశంలో నేలపాలు కాబోకు
ఓ కరోనా ఇకనైనవినుకో సరేనా

కరోనా కరోనా కరోనా ఓ కరోనా
ఓ మహమ్మారి కరోనా భూతమా
ఓ మాయదారి వైరస్ వాతమా
మా మానవ పాలిటి అశనిపాతమా

వైరస్ గా మారిన మా వైరివి నీవు
‌సైరన్ మోగిస్థు పాతాళభైరివైనావు
మేము ఏకమై నీ తోలుతిత్తి తీస్తం
సాముచేసి నిన్నుసాగనంపచూస్తం

కరోనా కరోనా కరోనా ఓ కరోనా
కోయిభీ యహా నహీ మరోనా
కావలసిన జాగ్రత్తలు తీసుకుందాం ఏకాగ్రతతో మనమంతా ఉందాం 

కరోనా కరోనా కరోనా ఓ కరోనా
పడొద్దురా భయ్యా నువు భయాన
ఎదుర్కొని జైయిధ్ధాంలే స్వయాన
అదుర్కొని అది పారిపోవు రయాన

కరోనా కరోనా కరోనా ఓ కరోనా
హమ్ సబ్ మిల్కేఅబ్ క్యా కరోనా
సై సై అంటూ శేక్యాహాండ్ ఇవ్వొద్దు
బై బై అంటు దూరం ఉంటే ముద్దు

కరోనా కరోనా కరోనా ఓ కరోనా
మా దేశానికి ఇక రావద్దు సరేనా
కాల గర్భంలో కలసిపో స్వయాన
కల వలే నిలిచిపో ఇక రయాన


కామెంట్‌లు