,రాజ యోగం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్,9491387977.నాగర్ కర్నూలు జిల్లా.

 వీర బోయినపల్లి గ్రామం లో పూటకూళ్ళ పేదరాశి పెద్దమ్మ అనే శైవమతస్తురాలు నివసిస్తుండేది. ఆమెకు ఇద్దరు కవల పిల్లలు. పెద్దవాడు భూపాలుడు, చిన్నవాడు గోపాలుడు. ఇద్దరిని పెద్ద చదువులు చదివించాలని ఆ ఆ తల్లి ఆరాటం. కానీ కానీ ఆ దిశలో ఆ పిల్లల ప్రవర్తన సరిగాలేదని గ్రహించిన ఆ తల్లి పక్కనే ఉన్న ప్రజ్ఞా పురం లో ఉన్న గురుకులానికి తీసుకెళ్లి చదువు చెప్పమని పరంధామయ్య గురువును కోరింది. పిల్లల జ్ఞానాన్ని పరిశీలించిన గురువు, పెద్ద వానికి చదువు అబ్బుతుంది. చిన్నవానికి చదువు అస్సలు వంట పట్టదు. అందువలన పెద్దవాన్ని గురుకులం లో చేర్చుకున్నాడు. చిన్నవాడిని తిరస్కరించాడు. గత్యంతరం లేక ఆ తల్లి పెద్దవారిని చేర్చి చిన్నవాడిని వెంటపెట్టుకొని స్వగ్రామానికి తిరిగొచ్చింది.
పాపం ఆ తల్లి ఎప్పటికప్పుడు పెద్ద వాని చదువు అభివృద్ధి తెలుసుకుంటూ, చిన్న వాని విషయంలో తెగ విచారం చేస్తూ జీవనం గడుపుతున్నది. అనుకోకుండా ఒకరోజు"మాతా!భిక్షాందేహి"అంటూ ఓ సాధువు అరుస్తూ తన ఇంటి వాకిట ముంగిట నిలుచున్న వైనాన్ని గమనించి లోపలికి రండి స్వామి! అంటూ ఆహ్వానించింది. ఆ స్వామికి కడుపార భోజనం వడ్డించింది. భుజించిన స్వామి ఆమె వైపు ఓసారి చూసి, మాతా! నిన్ను చూస్తుంటే నీవు ఏదో సమస్యతో సతమతమౌతున్నట్లున్నావు. విడమరచి నాకు చెబితే నీ సమస్యకు పరిష్కారం చెబుతా., అనగానే ఆ తల్లి తన చిన్న కొడుకు విషయం తేటతెల్లం చేసింది. అంతలోనే గోపాలుడు అక్కడికి రావడం చూసి ఆ స్వామి ఆ పిల్లవాని హస్తం తన చేతిలోకి తీసుకుని నిశితంగా పరిశీలించాడు."తల్లీ! నీవు చింతించవలసిన పనిలేదు. నీ బిడ్డ డు మహర్జాతకుడౌతాడు. ఈతనికి రాజయోగం ఉంది. నేనొక రక్షరేఖ ఇస్తా. దాన్ని బాలుడి మెడలో సదా ఉండేటట్టు చూసుకో, అంతేగాక నేనిచ్చే ఈ శివలింగానికి రోజు పూజలు చేయమ్మా. వచ్చే శివరాత్రి నాటికి నీవు నీ బిడ్డ తో కాశీ చేరుకుని ఆ కాశీ విశ్వనాధుని పూజిస్తే నీకు అంతా మంచే జరుగుతుంది. అని సాధువు చెప్పాడు.
శివరాత్రి రానేవచ్చింది పేదరాశి పెద్దమ్మ సాధువు చెప్పిన ప్రకారంగా గోపాలు ని తీసుకుని కాశి
 చేరుకుంది. కాశీ విశ్వనాధుని పూజించి తీర్థప్రసాదాలు తీసుకొని తిరిగి స్వగ్రామానికి బయలుదేరింది. ప్రయాణ బడలికతో కుంతల రాజ్యం సరిహద్దులో ఉన్న శివాలయములో కొడుకు తో పాటు వి శ్రమించింది. రాజాజ్ఞ ప్రకారంగా సైనికులు ఆ దేవాలయంలో విశ్రమించిన ఆ తల్లి కొడుకుల ను కనుగొని వారిని తీసుకెళ్లి రాజుకు అప్పజెప్పారు.
మరునాడు ఉదయం రాజు ఆ తల్లి కొడుకుల తో "మీరు కంగారు పడొద్దు. నేను చెప్పేది కాస్త వినండి. నేను నేను ఈ కుంతల దేశానికి రాజును. నాకు ఒకే ఒక బిడ్డ. ఆ బిడ్డ అంధురాలు. అంతేగాక పైగా మూగది. వివాహ వయస్సు వచ్చినందున వివాహంకై ప్రయత్నిస్తున్నాం. కానీ ఎవ్వరు కూడా వివాహ మాడుటకు ముందుకు రాలేదు ఒక సాధువు కాశీ విశ్వనాధుని మనసారా పూజిస్తే ఆ స్వామి కరుణించి మా కోరిక తీరుస్తాడని, నా బిడ్డకు భర్త లభిస్తాడని చెప్పాడు. ఆ ప్రకారంగానే ఇన్నాళ్లు ఆ విశ్వేశ్వరుని పూజించా. ఆ పూజాఫలం గా రాత్రి కలలో ఆ స్వామి "రాజా మీ రాజ్య సరిహద్దు దేవాలయంలో ఓ తల్లి తనయుడు ఉంటారు ఆమె తనయుడే నీ కుమార్తెకు భర్త అని చెప్పాడు. అందుకే మిమ్మల్ని రప్పించా. అది రాజు విషయం తేటతెల్లం చేశాడు.
రాజు మాటలు విన్న పేదరాశి పెద్దమ్మ తన ఇంటికి వచ్చి దీవించి పోయిన సాధువు, రాజుకు తటస్థ పడ్డ సాధువు ఒకటేనని గ్రహించి రాజుగారి మనవిని ఒప్పుకొని రాజకుమారితో తన తనయుని వివాహం జరిపించింది. రాజకుమార్తె మెడలో మంగళసూత్రం పడగానే ఆమెకు కళ్ళు, నోరు వచ్చినందుకు  అంతా సంతోషించారు. కులంలోని తన అన్నను పిలిపించుకొని గోపాలుడు అన్న సహాయసహకారాలతో రాజ్యాన్ని ఏలుతూ ఆ దేశ ప్రజల్లో మంచి వేరు స్థిరంగా చరిత్రలో నిలబెట్టుకున్నాడు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం