సూపర్ సోనిక్ విమానంఅంటే..:-కవి బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి,--కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా.--సెల్ నెంబర్.9491387977.

 బాలలూ! మీ అందరికీ ఆకాశంలో ఎగిరే విమానాల గురించి కాస్తోకూస్తో తెలుసు అనుకుంటా, కానీ ఈ విమానాల్లో దానికన్నా వేగంగా ప్రయాణించే సూపర్ సోనిక్ విమానాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మీకు ఇప్పుడు వివరిస్తా.
             ధ్వని వేగం పది వేల ఐదు వందలు (10500) మీటర్లు. ఎత్తులో గంటకు 1060కి.మీ. ఉంటుంది. ఈ వేగం కన్నా 1నుండి7వరకు మెక్ నెంబర్ల అధిక వేగంతో నడిచే విమానాలనే సూపర్ సోనిక్ విమానాలంటారు.
ధ్వనివేగానికి సమానంగా నడిస్తే వానిని మెక్-1అని, రెండు రెట్లు అయితే మెక్-2 అని అర్థం.
       మెక్-1కన్న తక్కువ వేగంతో నడిచే వాటిని నబ్ సోనిక్ విమానాలంటారు. ఫ్రాన్స్ బ్రిటన్ కలిసి కన్కర్డ్ అనే పేరుతో సూపర్ సోనిక్ విమానాన్ని తయారు చేశారు. ప్రపంచంలోకెల్లా గొప్ప విమానం ఇది. అమెరికా రష్యాలుకూడ ఈ విమానాలను తయారుచేసి విమాన దళాలను చేరవేసేందుకు ఉపయోగిస్తున్నారు.
మన దేశం కూడా నాసా శాస్త్రవేత్తల సహాయంతో ఎక్స్-43
అను పేరుగల సూపర్ సోనిక్ విమానాన్ని ఈ మధ్యనే తయారుచేసింది. దీని వేగం శబ్ద వేగం కన్నా 7రెట్లు అధికం. కానీ నాసా శాస్త్రవేత్తలు ప్రయోగించడంలో మాత్రం విఫలం అయ్యారు. అందుచేత దీన్ని పసిఫిక్ మహాసముద్రంలో కిందటి జూన్ రెండో తేదీన కూల్చి వేశారు. ఈ కూల్చివేసిన దృశ్యాల్ని మీరు రు టీవీలోనూ దినపత్రికలలో ను చూసి ఉంటారు అనుకుంటా.మరి సూపర్ సోనిక్ విమానం అంటే అర్థం అయిందనుకుంటా నేనుమీనుండి సెలవు తీసుకుంటా. ఇక ఉంటా మీ ...........................