106.ఆ.వె. పెళ్లియైన పిదప పెద్దలను నరుడు
విడిచి కాపురంబు వేరు బెట్టు
గూడు విడిచి పోవు గువ్వ రెక్కలు రాగ
రమ్య సూక్తులరయు రామకృష్ణ .
107. ఆ.వె.చిన్న పిల్లవాడు చెప్పినట్టు వినును
పెద్దవాడు వినడు నిద్దరణిని
మొక్క వంగు గాని చెక్క వంగునె మహి
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
108. ఆ.వె. అప్పుపాలగుదువు నాడంబర పనుల
నాపద నెవరింక నాదుకోరు
మంచముండినంత యెంచికాలునుజాపు
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి