ప్రాణ దాత:-సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.మొబైల్: 9908554535.


 ఒక మోసకారి నక్క అడవిలో పరుగు పెడుతూ ఒక ఊబిలో దిగబడిపోయింది . అది ఎంత ప్రయత్నించినా దాని నుండి బయటపడలేదు .చివరికి తనకు చావు తప్పదని ఇతర జంతువులతో గట్టిగా కాపాడమని అరచింది .

         చివరకు ఒక కుందేలు దాని అరుపులు విని జాలిపడి  దానిని కాపాడుటకు వెళ్ళింది.  దూరంగా నిలబడిన కుందేలు ఆ  ఊబిలో దేనినైనా పట్టుకొమ్మని  చెప్పింది . కానీ నక్కకు అక్కడ పట్టుకొనుటకు ఏమీ దొరకలేదు. అప్పుడు కుందేలు ఒక త్రాడును  తెచ్చి ఒడ్డున గల చెట్టుకు గట్టిగా దాని కొసను ముడి వేసింది. మరొక కొసను  ఊబిలోనికి విసరివేసింది .నక్క ఆ  త్రాడును పట్టుకుని బయటకు వచ్చి కుందేలుకు కృతజ్ఞతలు తెలిపింది.

            ఆ తదుపరి అడవి జంతువుల సమావేశంలో నక్క కుందేలు తనకు చేసిన సహాయాన్ని తెలిపి , తనను కాపాడింది ఒక చెట్టు అనీ , దానికి త్రాడును కట్టడం వల్లనే  తను బ్రతికి బయట పడినానని  చెప్పింది . అప్పుడు జంతువులన్నీ ఈరోజు నుండి మనం చెట్ల ఆకులు, కాయలు ,పండ్లు తినాలి తప్ప చెట్టు వేర్లను ఏమీ చేయకూడదనీ, వాటిని కాపాడాలనీ , మానవుల్లాగా వాటిని నాశనం చేయవద్దనీ , అవి ప్రాణదాతలనీ  తీర్మానించాయి.కావున పిల్లలూ! చెట్లు ప్రాణదాతలు.అందుకే  వాటిని మనం కాపాడాలి.


కామెంట్‌లు