కోట్ల యేళ్ళ పరిణామం
నేటి నేల నిర్మాణం
పచ్చదనం విరియుటకది
అచ్చమైన ఆశ్రయం
ఏ గ్రహం లోన వెదికినను
పచ్చదనం కనలేము
ఏ గ్రహం లోకి పోయినను
హరిత ధనం పొందలేము
గాలి నీరు పంటలకది
ఆలవాలమయ్యెను
జీవి సుఖము గుండుటకది
అభయహస్తమయ్యెను
భూగ్రహమున మనముండుట
అడగని ఒక వరం
ఆ వరమును వృధా చేస్తే
అగును గ్రహం కడు నరకం
నిర్మాణం కడు కష్టం
విధ్వంసం బహు సులభం
వివేకం తో ఈ సత్యం
గుర్తించిన కడు క్షేమం
పచ్చనైన ఈ భూమిని
పవిత్రముగ చూద్దాం
జేజెమ్మగ ఈ ధరణిని
అందరము కొలుద్దాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి