నటుడు/దర్శకుడు/రచయిత:(అక్షరమాలికలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 ఏకపది:(నటుడు)
*******
1.రంగులు పులుముకొని...అభినయ రాగాలను చూపిస్తాడు!
2.నవరసాలు అభినయించి....ప్రేక్షకులకు బ్రహ్మానందాన్ని కలిగిస్తాడు!
ద్విపది:(దర్శకుడు)
********
1.సృజనాత్మకతతో కథను ఆవిష్కరిస్తాడు.
నటనను రాబట్టడానికి తీవ్రంగా శ్రమిస్తాడు.
2.అద్భుత దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తాడు.
కథ,కథనాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు.
త్రిపది:(రచయిత)
******
1.మాటలైనా,పాటలైనా కథానుగుణంగా వ్రాస్తాడు.
సన్నివేశాలను చిత్రీకరించడంలో ఔచిత్యాన్ని ప్రదర్శిస్తాడు.
మాటల్లో విరుపులను,పాటల్లో మెరుపులను‌ వినిపిస్తాడు.
2.రసోచిత్య భావానురాగాలను రంగరిస్తాడు.
సమాజనాడిని పట్టుకుంటూనే సహజమై భాసిస్తాడు.
రచనలో తానెక్కడా కనబడక ముద్ర బలంగా వేస్తాడు.