ఉడుత ఊపులకు ఉసిరికాయలు రాలతాయా? (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

        ఓ ఉడత ఉండేది. 
       అది ఈత చెట్టు ఎక్కి ఈత కాయలు తింటుంది.
       దాన్ని ఓ కుక్క  చూసింది. 
       ఉడుతను తినాలనుకుంది. 
       ఎప్పుడు చెట్టు దిగితే అప్పుడు పట్టుకోవాలనుకుంది.
       పొదలచాటున నిలబడి పొంచి పొంచి చూస్తుంది.
       ఉడుత కడుపునిండా కాయలు తిన్నది. 
       గబుక్కునా దూకింది. 
       కుక్క పట్టుకోబోయింది. 
       ఉడుత ఉరికింది. 
       ఉరికి ఉరికి ఉసిరి చెట్టు ఎక్కింది. 
       కుక్క ఉసిరి చెట్టు కింద కూర్చుంది. 
       ఎప్పుడు దిగితే అప్పుడు పట్టుకొని నమిలేయాలని దాని ఆశ.
       చెట్టు మీద ఉడుత కొమ్మల మీద అటూ ఇటూ దూకుతుంది. 
       "ఓ కుక్క బావ! అలాగే ఉండు. 
         నీ పని పడుతా చూడు. 
        ఈ కొమ్మను ఊపానంటే ఉసిరి కాయలు వడగండ్లు వానలా రాలతాయి. 
       అవి నీ నడ్డి మీద పడితే నడ్డిదానిది అవుతావు. 
       కంటి గుడ్డు మీద పడితే గుడ్డిదానవు
అవుతావు జాగ్రత్త" అంది ఉడుత.
       నడ్డీ గుడ్డీ అనే సరికి కుక్క చల్లగా జారుకుంది.
        ఉడుత ఊగి ఊగి నవ్వుకుంది.
       “ఉడుత వూపులకు ఉసిరి కాయలు రాలతాయా? పిచ్చి కుక్క నమ్మింది" అనుకుంది ఉడుత.
కామెంట్‌లు