బొల్లారం బాల కవులకు ప్రశంసా పత్రాలు.


 బొల్లారం బాల కవులకు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.బొల్లారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన కొండపల్లి ఉదయ్ కిరణ్, దాసరి జగదీష్ ఉగాది కవితోత్సవంలో ఉత్తమ కవితల్ని అందించి ప్రశంసా పత్రాలు పొందినట్లు తెలుగు భాషోపాధ్యుడు అడ్డాడ శ్రీనివాస్ రావు తెలిపారు.కరీంనగర్ కు చెందిన మహాతీ సాహితీ కవి సంగమం సంస్థ శ్రీప్లవనామ ఉగాది సందర్భంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉగాది కవితోత్సవంలో ఈ ఇద్దరు బాల కవులు పాల్గొని ప్రతిభ కనబరచడంతో ప్రశంసా పత్రాలు అందజేశారు.వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు  మంగీలాల్, ఇతర ఉపాద్యాయులు, విద్యార్థులు అభినందించారు.
కామెంట్‌లు