పూల మాల:-డా.కందేపి రాణి ప్రసాద్
రారండోయ్! పిల్లలారా!రా రండి
రంగు రంగుల పూలు తెంపుకు రండి
రాణిగారి పూలతోటలోన
రంగు రంగు ల పూల మొక్కలు

సింధూర వర్ణపు తొడిమ
పాల తెలుపు పొట్టి రెక్కలున్న పారిజతం పువ్వుల్ని తెండి!

మెత్త మెత్తగా ఎర్రని ఎరుపుతో
కుచ్చులు కుచ్చులుగా పూసే
పట్టుకుచ్చుల పూలు తేరండి!

బంగారు రేకులు గుచ్చినట్లు
సూర్య కిరణాలు మూట కట్టినట్లున్న
ముద్ద బంతి పూలనే తెండి!

తన పేరునే రంగుగా చేసుకొని
తేలికైన పల్చని శరీరమున్న
కనకంబరాలనే తీసుకురండి!

పచ్చని పసుపు ముద్దలు 
చిన్న చెట్టుకే చాటేడు పూలు
చిట్టి చేమంతులనే తెరండి!

తెచ్చిన పూలన్ని రాశిగా పోసి
పూలన్ని మూలలుగా కట్టండి!
కట్టిన మూలలను తెచ్చి చక్కగా
చదువుల తల్లి మెడలో వేయండి!

రాణి గారి పూలతోటలోన
రంగు రంగుల పూలున్నాయి. 

కామెంట్‌లు