పిల్లలారా విన్నారా ?
పాపల్లారా విన్నారా ?
శ్రీ శ్రీ గురించి విన్నారా ?
శ్రీ శ్రీ అంటే ఏమిటని
ఎప్పుడైనా --
వివరంగా తెలుసుకున్నారా ?
కవిత్వాన్ని సామాన్యుడివరకూ
సరళమైన పదాలతో
సులభంగా అర్ధంచేసుకునేలా ,
కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన
మహాకవి మన శ్రీ శ్రీ ....ఆయనే
శ్రీరంగం శ్రీనివాసరావు ...!
ఏదైనా కవిత్వం రాయడానికి
ముడిసరుకేనని ప్రకటించి
అక్షరాలా పాటించి
ఈనాటికీ లేత ..లేత ..కవులకు
మార్గదర్శకుడైనాడు
మన మహాకవి శ్రీ శ్రీ ....!
ఆయన మార్గం
పిల్లలకు అనుసరణీయం ,
కాబోయే కొత్తకవులకు ,
ఎప్పటికీ ..ఆయనే 'దిక్చూచి '..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి