బేతాళ మాంత్రికుని మందు (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

       రాణి గారికి కడుపులో నొప్పి వచ్చింది.
       ఏమి చేయాలో తోచక రాజు కాలుగాలిన పిల్లిలా తిరిగాడు.
       రాణి తోక తెగిన ఎలుకలా ఎగురుతుంది. 
       రాజవైద్యుడు రాజహంస వచ్చింది. 
       రాణి సింహం అవస్థ చూసింది. 
       మందులు, మాకులు ఇచ్చింది. 
       నొప్పి ఎక్కువ అయిందేగానీ కొంచమయినా తగ్గలేదు.
       హంసకు ఓ ఆలోచన వచ్చింది. 
       “మహారాణి! మీరేమి దిగులు పడకండి. 
        మంత్రాల దీవిలో బేతాళ మాంత్రికుడు ఉన్నాడు. 
       అతడు ఇచ్చే మందుకు తిరుగే ఉండదు. 
       ఉండండి ఇప్పుడే తేస్తా" అని రాజహంస రయ్యిన ఎగిరిపోయింది.
        కొంత సేపటికి తిరిగి వచ్చింది. 
        చేతిలో పొట్లం విప్పింది.
        పొడుంను పాలలో కలిపింది. 
        రాణిచే తాగించింది. 
        అద్భుతంగా మందు పనిచేసింది. 
        రాణి కడుపు నొప్పి పోయింది.
        రాజు ఆశ్చర్యపోయాడు. 
        హంసను మెచ్చుకున్నాడు. 
        “హంసా! హంసా!! అది సరేగానీ, ఇంత తొందరగా ఆ మందు ఎలా తెచ్చావు?   
        మంత్రాలు దీవి వెళ్ళాలంటే మాటలా? 
        బేతాళ మాంత్రికుడు మాములు వారికి మందులే ఇవ్వడే. 
        నీ వెలా తెచ్చావు?" అని అడిగాడు.
        హంస నవ్వింది.
        "రాజా! నేను తెచ్చింది బేతాళ మాంత్రికుని మందు కాదు, గీతాళ మాంత్రికుని మందు కాదు. 
        మా పోయిలోని బూడిద. 
        ప్రస్తుతానికి అది ఇవ్వక తప్పలేదు. 
        రాణి గారి కడుపునొప్పికి పనిచేసింది.
        బేతాళ మాంత్రికుని మందు కాదు. 
        నమ్మకం అనే మందు. 
        ముందు నేను ఇచ్చిందే అసలయిన మందు" అంది హంస. 
       హంస తెలివికి మృగరాజు సింహం ముక్కుమీద వేలేసుకుంది.
కామెంట్‌లు