చెరకు తోటలో గాడిద చిందులు (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

         ఏటి ఒడ్డున చెరకు చేను ఉంది.
       ఈ సంగతి గాడిదకు తెలిసింది. 
        తెలియగానే ఎగిరి గంతేసింది.
        పరుగు పరుగునా పంది ఇంటికి పోయింది. 
       “పంది మిత్రమా! పంది మిత్రమా!! పా
పోదాం.
        ఏటి గట్టున చెరకు తోట ఉంది.   
        కడుపునిండా తిని వద్దాం పదా" అంది.
        "వామ్మో అంత దూరమా? నేను రానులే మిత్రమా. 
       ఇక్కడే గడ్డీ, గాదం తిని ఉంటా.
       నీవు పోయిరా” అంది పంది.
       "భలే దానివేలే పంది. 
       చెరకంటే ఏమనుకున్నావు. 
       చెరకు రసం దివ్వ ఔషదం.
        ప్రకృతి ప్రసాదించిన తేనే.
        సర్వరోగ నివారిణి. 
       ఏడాదికోసారైనా చెరకు రసం తాగాలని చెబుతుంటారు.
       నీవెప్పుడూ వినలేదా?" అంది గాడిద.
        ఏమోనమ్మో! నీవు ఎన్నైనా చెప్పు.
        నేను మాత్రం రాను. 
        అది కొత్త ప్రాంతం.
        ఏం ప్రమాదాలు పొంచి ఉంటాయో ఏమో?
       బ్రతికుంటే బలుసాకైనా తిని బ్రతుకుతా.
        కోరి కొరివితో తల గోక్కోవటం ఎందుకు?" అంది పంది.
       వెళ్ళింది. 
       చేలోపడింది. 
       ఆ తోట నిండా జిలాకు చెట్లు. 
       గాడిద అలా దూరిందో లేదో జిలగొండి ఆకు వంటి నిండా అంటుకుంది. 
       గాడిద గంతులేసింది. 
       ఒక్క అంగలో చేను బయట పడింది.    
       చిందులేసుకుంటూ పరిగెత్తింది. 
       కనిపించిన చెట్టుకు రుద్దుకుని ఒళ్లును గీక్కుంది.
       ఆ తరువాత పంది వెంట వెళ్ళి పచ్చగడ్డి తిన్నది.
కామెంట్‌లు