చంద్రగుప్తుడు:-డా.కందేపి రాణి ప్రసాద్
గుప్తులలో సాటిలేని మేటిగా
గొప్ప పేరు తెచ్చుకున్న రాజు
విక్రమాదిత్యుడనే బిరుదంతో
విమల కీర్తిని సాధించిన రాజు

పాటలిపుత్ర నుండి ఉజ్జయిని
రాజధానిని మార్చిన రాజు
పాహియన్ అనే చైనా యాత్రికుడి
ప్రశంసలు మెండుగా పొందినరాజు

సాహిత్యం,కలలు ,విజ్ఞానాలను
సమానంగా ప్రేమించిన రాజు
పరమత సహనం పాటించి
ప్రతిష్ట విలువ పెంచిన రాజు

కాళిదాసును , వరాహామిహిరుణ్ణి
ఆస్థాన కవులుగా చేసుకున్న రాజు
వైద్య పితమహుడైన ధన్వంతరిని 
నవరత్నాలలో నిలిపిన రాజు

మూడో శతాబ్దిలో ముప్పై ఐదేళ్లు
పాలించి పేరు తెచ్చుకున్న రాజు
చరిత్రలో గుప్తుల యొక్క కాలాన్ని
స్వర్ణయుగంగా లిఖించిన రాజు! 

కామెంట్‌లు