దొంగకు దొరకని నిధి(మణి పూసల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
అమ్మ చెప్పే మాటలు
అక్షరాలకు మూటలు
నాన్న చూపేటి దారి
చదువుల కొరకు బాటలు

మంచి నేర్పే బడులు
చదువు నేర్పు గురువులు
మంచి వాక్యాలతో
చక్కని పుస్తకాలు

పుస్తకాల చదువులు
మస్తకాల వెలుగులు
బ్రతుకు దెరువు చూపేటి
దివ్య జ్ఞాన జ్యోతులు

పుస్తక ఆక్షర నిధులు
దొంగకు దొరకని నిదులు
ఎంతో సాధన చేస్తే
సొంతం పుస్తక నిధులు


కామెంట్‌లు