విచిత్ర వ్యక్తి:-- యామిజాల జగదీశ్

 పుస్తకాల దుకాణంలో కొంత కాలం పని చేసిన మిత్రుడొకడు ఓ విషయం పంచుకున్నాడు. నాకది అరుదైనదిగా అనిపించింది. ఓ వ్యక్తి గురించి చెప్పాడు. 
ఆ వ్యక్తి పేరు అబూ ఇబ్రహీం. అతను ప్రతీ గురువారం మధ్యాహ్నం షాపుకొస్తాడట. కనీసం ముప్పై నలబై పుస్తకాలు కొంటాడట. ఒకమారు నా మిత్రుడు అడిగాడట...
"ఇన్ని పుస్తకాలు కొంటున్నారు కదా. ఏదైనా లైబ్రరీ ఉందా మీకు?" అని.
అప్పుడు ఇబ్రహీం "అబ్బే నా దగ్గర లైబ్రరీ అంటూ ఏమీ లేదు. కానీ ప్రతీ శుక్రవారం మా ఇంటికి దగ్గర్లో ఉన్న మసీదు దగ్గరకు వెళ్ళి అక్కడ వీటిని పంచుతాను. అలాగే అక్కడెవరైనా పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళేవైనా పుస్తకాలు కావాలని అడిగితే అవి కొనిస్తాను. నిజానికి నాకు పుస్తకాల మీద అంతగా ఆసక్తి లేదు. పెద్దగా చదువుకోలేదు. కానీ ఎవరైనా చదువుతారంటే వారికి ఇలా పుస్తకాలు కొనిస్తుంటాను...." అన్నారు.

కామెంట్‌లు