విసన కర్ర : ----డా.కె .ఎల్ .వి.ప్రసాద్ , హన్మకొండ .

 పేదవాడికి
పనిచేసినంతవ రకూ,
ఉక్క పోతలు
చెమటలూ
చల్లదనాలూ
గుర్తుకే రావు..!
విశ్రాంతి సమయంలో ,
విసనకర్ర ఉండగా ...
ఏ .సి ,లూ -కూలర్లూ 
సీలింగ్ ఫ్యాన్ లూ 
ఆలోచనలకు రావు !
ఉన్నదానితో -
తృప్తిపడడం 
సామాన్యుడి లక్షణం !
వీలుకానిదాని గురించి 
ఆలోచించడం ....
మాయదారి రోగం ...!!

కామెంట్‌లు