సాయంకాలం ఆరు గంటలకే మా రాత్రి భోజనం
డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఎవరికి తోచింది వారు తిని
ప్లేట్ శుభ్రం చేసుకుని వచ్చి కిట్ బాక్సులో భద్ర పరుచు
కుంటారు. ఏమైనప్పటికీ మిలిటరీ ట్రైనింగ్ సెంటర్లో రిక్రుట్సు
జీవితం కష్టతరంగానే గడుస్తుంది.
కొత్త జీవనశైలి ,కొత్త ప్రదేశం , కొత్త మనుషుల మద్య
జీవితం, రకరకాల భాషల సంగమం అంతా అయోమయం.
రోజులు గడుస్తున్న కొద్ది ఆ పరిసరాలు వాతావరణానికి
అలవాటు పడుతూంటే అనుభవం వస్తుంది. దైనందిన
అవసరాలకు వెట్ కేంటిన్లో ఆహార నిత్యావసర వస్తువులు
లబ్యమౌతాయి.పోకెట్ డైరి లాంటి పుస్తకంలో ఇచ్చిన
వస్తువుల ఖరీదు చేర్చి నెల మొదటి వారంలో జీతం నుంచి
మినహాయిస్తారు.
భాష కలిసిన వారు ఉంటే మరింత సమయం ఆనందంగా
ఉంటుంది. రాత్రి భోజనం అవగానే కొత్త ఫ్రెండ్స్ తో కాలక్షేపం ,
బేరక్ బయట కూర్చుని రిక్రయేషన్ రూము నుంచి స్పీకర్లో
వచ్చే హిందీ సినేమా పాటలు వింటు కాలక్షేపం చేస్తారు.
సాయంత్రం అవగానే ఫుల్ హేండ్స్ మలేషియన్ షర్టు
పేంటు వేసుకోవాలి. దోమతెర కట్టి మంచం చుట్టు బిగించాలి.
రాత్రి పది గంటలవగానే లైట్లు ఆపి మంచం మీద ఉండాలి.
నైట్ డ్యూటీ స్టాఫ్ మొత్తం బేరక్స్ రౌండ్స్ చేస్తూంటారు.
రిక్రూట్స్ పగలంతా అలిసి ఉన్నందున తొందరగానే నిద్రపోతారు.మళ్లా ఉదయం నాలుగు గంటల ముందు నుంచే
ఉరుకుల పరుగుల దినచర్య. బయట సివిల్ జనంతో కలయిక
ఉండదు.
ఆదివారం శలవు రోజుల్లో సెంటర్ నుంచి బయటకు
వెళ్లాలంటే ఔట్ పాస్ పేపర్ మీద రిక్రూట్ వివరాలు ఎక్కడకు
వెళ్లేది వివరాలు రాసి సెక్షన్ ఇన్చార్జి సంతకం ప్లాటూన్ కమాండర్ సంతకం ఫైనల్ గా కంపెనీ ఆఫీసర్ సంతకం అయిన
తర్వాత బయటకు వెళ్లి సాయంకాలం నాలుగు గంటల వరకూ
వచ్చి సెక్షన్ ఇన్చార్జి కి రిపోర్టు చెయ్యాలి. ఏవైన పర్యాటక
స్థలాలను సెక్షన్ ఇన్చార్జి వెంట ఉండి చూపిస్తారు. అలాగే
రోడ్ మార్చ్ అని కొన్ని కిలోమీటర్లు బృందాలుగా బయట
నడిపిస్తారు.
మిలిటరీ ట్రైనింగ్ సెంటర్ ఆరునెలల కాలం రిక్రూట్సుకు
గడ్డుగానే గడుస్తుంది.సైనికుడి మొదటి అడుగు ఇక్కడి నుంచే
ప్రారంభమౌతుంది.
ఆరు నెలల నిరంతర వివిధ అంశాల మీద అంటే గ్రౌండ్
పెరేడ్ వరుసలో అడుగులో అడుగు కలుపుతు ముందుకు
వెనక్కి నడవడం సెల్యూటింగ్ వంటి క్రియలతో ట్రైనింగ్,
ఆయుధంతో వాకింగ్ , ఉపయోగించడం అలాగే యుద్ధ
సమయంలో తోటి గాయపడ్డ సైనికులను సురక్షిత ప్రదేశాలకు
చేర్చడం వంటి ట్రైనింగ్ జరుగుతుంది. ఆయుధాల రక్షణ
మైంటినెన్సు నేర్పుతారు.
మొత్తం అన్ని రంగాల్లో నియమిత కాలంలో ట్రైనింగ్
పూర్తయిన తర్వాత కసం పెరేడ్ జాతీయ
పతాకం మీద చేయి వేసి అన్ని మతస్థుల మతాదిపతులు
ప్రమాణం చేయిస్తారు.
జాతీయ పతాకం మీద ప్రమాణం చేసినప్పటి నుంచి
అసలైన సైనికుడిగా గుర్తింపు వస్తుంది.ఆకపచ్చ యూనిఫామ్
వేసుకుని స్మార్ట్ గా కానొస్తాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి