శ్రీరామనవమి, ఉగాది పురస్కారాలు అందుకున్న రచయిత డాక్టర్ చిటికెన

  శ్రీరామనవమి కవితా వసంతోత్సవ వేడుకలు  జోర్దార్ దినపత్రిక, పరిమళం సాహిత్య దినపత్రిక, నేత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ ద్వారా కవిసమ్మేళనంలో పాల్గొన్నందుకు (  శ్రీరామనవమి 2021 ) పురస్కారాన్ని  సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు అందించారు.   ఇటీవలే జోర్దార్ జాతీయ సామాజిక సాంస్కృతిక తెలుగు దిన పత్రిక వారు నిర్వహించిన  ఉగాది ( ప్లవ నామ సంవత్సర ) పురస్కారాలు 2021.  కవితా పోటీలలో పాల్గొని ప్రతిభ కనపరిచినందుకు, ప్రశంసాపత్రాన్ని అందజేసి, శీల్డ్  తో  సంస్థ వ్యవస్థాపకులు సత్కరించారు..


" సాహిత్య కళానిధి " బిరుదును  డాక్టర్ చిటికెన కు   ప్రధానం చేసిన సాహితీ బృందావన విహార జాతీయ వేదిక
---------------------
 సాహితీ బృందావన విహార జాతీయ వేదిక ఖమ్మం, తెలంగాణ.. వారు ప్రతిష్టాత్మకంగా జాతీయ ఉగాది విశిష్ట ప్రతిభా పురస్కారాలు నిర్వహించారు. 2021 కి గాను సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యువ సాహితీవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను ఎంపిక చేసినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. సాహిత్యంలో విశిష్ట సేవలు అందిస్తున్న యువ సాహితీవేత్తల లో ప్రత్యేకంగా తన రచనలు  కొనసాగు తున్నాయని అందుకు * సాహిత్య కళానిధి *  బిరుదును అందిస్తున్నట్లు గా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు నెల్లుట్ల సునీత తెలియజేశారు.  సంస్థ ప్రధాన కార్యదర్శి వాకిటి రామ్ రెడ్డి, కోశాధికారి పసునూటి  సాయి తరుణ్, గౌరవ సలహాదారులు ఏనుగు నరసింహారెడ్డి ( అడిషనల్ కలెక్టర్ ), శ్రీ పొట్లూరి హరి కృష్ణ తదితరులు కిరణ్ కుమార్ ను అభినందించారు.. 
     కిరణ్ కుమార్ మాట్లాడుతూ  నేటి కాలంలో సాహితీవేత్తలకు ప్రతిభా పురస్కారాలు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయని, సమాజసేవలో భాగం అవుతున్న సాహితీవేత్తలను గుర్తించి
 పురస్కారాలు అందించిన సాహితీ సంస్థలకు డా. చిటికెన కిరణ్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం