కోలాటం(బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
చిన్ని కృష్ణ రావయ్య
కోలలు మేము తెచ్చాము
ఆటలు ఆడ రావయ్యా
పాటలు పాడ రావయ్యా

వేణువూదే కృష్ణయ్య
భక్తితో మేము పిలిచాము
అడుగులేస్తూ కృష్ణయ్య
అరుగులు నీవు ఎక్కయ్య

చిన్న కోలలు తెచ్చాము
చిన్నారి కృష్ణ రావయ్య
తోటి పిల్లలు వచ్చారు
కోలాటం నీవు ఆడయ్య

కొంటె కృష్ణ రావయ్యా
చుట్టు మేము తిరుగుతూ
జడ కోలాటం వేస్తాము
వడివడిగా ఆడు కృష్ణయ్య