*ధరణి ధోరణి!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు
1.ధరణి కారుణ్యరూపిణి!
   అది ఓ గ్రహమా!
    మనపాలిట అనుగ్రహం!
   జీవజాలానికి అనుకూల, 
      ఏకైక చైతన్య స్వరూపం!
  ఏర్పడిన నాటి నుండి
   దానిదో ఓ *మహాప్రస్థానం!*
2.అమ్మ కడుపు లో ఉన్నా,
   బయటకొచ్చి అడుగులేసినా,
  మనల్ని సహించి మోసింది!
 మాతకి పెంచడమే తెలుసు!
   భూమాతకి తన సీతనేకాక,
ఎవరినైనా తనలో,
  కలుపుకోవడం బాగాతెలుసు!
3.నేడు మానవుడు,తల్లిపాలు,
   తాగడు, రొమ్ము గుద్దుతాడు!
   భూగర్భజలాలు పెంచడు,
    భూమంతా బోర్లు వేస్తాడు
మనిషికికృతజ్ఞతారాహిత్యం!
   భూమికి ఎన్నడూ పరహితం
4.భూమితోనే ప్రకృతి పులకింత,
    అందం, ఆనందాల పూత,
 భూమి స్వర్గమైనా,నరకమైనా,
   ఆ ఘనత *మనిషిదే!*


కామెంట్‌లు