కుక్క తోకాడించడం: -- యామిజాల జగదీశ్

 ఓ పిల్లి కుక్కతో "నిన్ను చూస్తే నాకు మాత్రమే కాదు, మనుషులకు కూడా ఈర్ష్యే అంది.
"ఎందుకట" అడిగింది కుక్క.
"ఎందుకంటావేమిటీ....తోక ఆడిస్తూనే నీ పనులు కానిచ్చుకుని నువ్వు బతికేస్తుంటావు. ఎంతైనా నువ్వు బతకనేర్చిన దానివే" అంది పిల్లి నవ్వుతూ.
అప్పుడు కుక్క "మనుషులలోనూ కొందరు ఎవరేం చెప్పినా తలాడిస్తూ బతుకుతుండటం చూసే నేను తోకాడిస్తూ నా పనులు చక్కదిద్దుకునే పద్ధతి అలవరచుకున్నాను. అది తప్పా" చెప్పింది.
అంతే, పిల్లి ఇంకో మాట మాట్లాడలేదు.