(మూడవ భాగము)
9.
సరియగు వేళకు నాతడు
నీరు మేత ఇచ్చి వాని
ప్రేమమీర పెంచుకొనియె
తన పాపలె అనుకొనియె !
10.
గొర్రె కుక్క గూడ అటులే
స్నేహముతో మెలగసాగె
యజమానితొ ఆదరమును
జూపుచుండ్రి దిగులులేక !
11.
కతిపయ దినమ్ములకే
గర్భమును దాలిచె ఆ రెండును
గురవయ్యా గురవమ్మల
ఆనందము మించిపోయె !
12.
నెలలు నిండి సుఖప్రసవము
అయ్యినాయి గొర్రె , కుక్క
పండు వంటి పిల్లలకు
అయ్యనాయి తల్లులుగా !
(ఇంకావుంది)
*గొర్రెతల్లి కుక్క*(గేయకథ):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి