రేపటి యుద్దాలు
నీటికోసం
రేపటి అలజడులు
నీటికోసం
రేపటి తగాదాలు
నీటికోసం
రేపటి మనః స్పర్ధలు
నీటికోసం!
అడవులు
అంతరించి పోయి,
వృక్ష సంపద
తరిగిపోయి,
జలసంరక్షణ లో
వెనుకబడిపోయి,
భూగర్భ జలాలు
తరిగిపోయి,
బావులు,చెరువులు,
ఎండిపోయి,
నీటి ఎద్దడి
తరుముకొస్తుంది
గుక్కెడు మంచినీళ్లు
కరువై పోయే
ప్రమాదం పొంచివుంది,
జరభద్రం జనులరా..!
నీటి పొదుపు ఆవశ్యం
మహానుభావులరా!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి