పొగాకు హాని చేయును
పగతో ప్రాణం తీయును
గుప్పు గుప్పున వదిలేయు
ఆ పొగ కళ్ళను మూయును!
సావాసంలో సరదా
సిగిరెట్టు రింగులూదా
అలవాటే అయిపోగా
పొగాకు ముంచి వేయదా !
గుట్కాతో చిన్నిగుండె
మంటల్లో రగులుచుండె
జీర్ణక్రియ మందగించి
నోటిపుండు క్రమమునుండె!
ఖైనీతో కైపు కనులు
దూరంగా తొలుగు జనులు
జర్దా పాను వ్యసనం
రోగంతో మునుగు ఘనులు!
బీదలకు బీడీలేల
దగ్గుముంచి వేసేనెల
టీబీ వ్యాధులు వచ్చి
సొమ్ముఖర్చు తగ్గేదెల !
చుట్ట నీకు చుట్టమయిన
ఊపిరి తీయును నాయన
నరాల బలహీనతతో
ఆసుపత్రి పాలు అయిన!
ముక్కుపొడి పీల్చ రాదు
పొగాకసలు వాడరాదు
కాన్సరు కలిగించు నదియె
నికోటినున విషము కలదు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి