నే ను,దయ్యాలకథ లు,చెప్పడంవాల్లుచాలా జాగ్రత్తగ భయం భయం తో వినడం,ముఖ్యంగా,శీను -- పద్మజలకు ,బాగ అలవాటు అయిపొయింది.వారి భయాన్ని గమనిస్తూ ,నేను చాలా సంతోషంతో ఆ కథలను చెబుతున్డేవాడిని . ఆ సమయంలో అందరూ దయ్యా లు వున్నాయని చాలా బాగా నమ్మేవారు. ఆ దయ్యాలు పడితే వదిలించడానికి దెయ్యాల మంత్రగాల్లు కూడా ఉండేవారు. దయ్యాలతో బాధపడుతున్నవారికి చేతికి,వాల్లు యంత్రాలు కట్టే వారు ,అలాగే ఇంట్లో పైన ఉండే కట్టె దూలాలకు కూడా యంత్రాలు కట్టేవారు. అవి నేను 9 వ క్లాస్ చదువుతున్న రోజులు . భువనగిరి కి దగ్గరలో ఉన్న ఇంకొక గ్రామం లో ఉన్నాను. అది నా బాల్యమిత్రుడు, నాకు చాలా ఇష్టమైన కర్ణాకర్ ఇల్లు. ఆ రోజుల్లో పెద్ద వాళ్లను అందర్నీ మేము అత్తయ్య మామయ్య అని పిలిచేవాళ్ళం, లేదా బాబాయి పిన్ని. ఈ అంకుల్ ఆంటీ లు లేరు. ఎవరైనా కొత్తవారు వచ్చి ఈ అబ్బాయి మీకు అల్లుడా? ఎలా? అమ్మాయిని ఇస్తారా ?అని అడిగితే మా అత్తయ్య "లేదు. నాకు మేనల్లుడు "అని చెప్పేది. ఆ సమయంలో పద్మజ ,నేను నవ్వుతూ ఒకరినొకరు చూసుకునే వాళ్ళం. పద్మజ రెండు పొడవాటి జడ ల తో చురుకైన కళ్ళతో చాలా చిలిపిగా ఉండేది. నేను కర్ణాకర్ తో అనే వాడిని ,"ఒరేయ్ !మీ చెల్లెలిని పెళ్లి చేసుకుంటాను రా !"అని. వాడు దానికి నవ్వి "ఒరేయ్! దాన్ని చేసుకుంటే ,నువ్వు ఎక్కడ బ్రతుకుతావు రా? , నీ బ్రతుకు మటాష్ ! " అనేవాడు. అంతే మళ్లీ దాని గురించి మాట -- ముచ్చట ఏమీ ఉండేది కాదు. మళ్లీ మా లోకంలో మా ఆటల్లో పడి పోయే వాళ్ళం.అంత నిష్కల్మషమైన మనసుతో నిర్మలంగా స్నేహాన్ని సాగించాం.
అదేంటో కానీ ఆ రోజుల్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల స్నేహితులను చాలా ప్రేమగా చూసుకునే వారు. నేను అందుకే మా కరుణాకర్ ఇంటికి వెళ్లి వారం పది రోజులు వుండి వచ్చేవాడిని. స్కూల్లో ఉన్నంతసేపు మరియు ఇంటికి వెళ్లాక కూడా ఒకరినొకరు అసలు వదలకుండా ఉండేవాళ్ళం. వాడి వూరిలో ఉదయాన్నే లేచి మేము కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఊరవతల దూరంగా ఉన్న వాగు కి వెళ్ళే వాళ్ళం.
పద్మజ 7 వ తరగతి చదువుతూ ఉండేది. ఆ స్కూలు వారింటికి దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరం ఉండే ది. ఒక రోజు స్కూల్ అయిపోయాక కూల్ గా నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. తల్లి కనపడగానే బోరున ఏడవడం మొదలు పెట్టింది .ఏంటి సంగతి ,అంటే ఒక అమ్మాయి కొట్టింది అని. ఎక్కడ ?ఎక్కడ? అని మేము అడిగితే ,"స్కూల్లో "అంది నేనేమో నవ్వటం మొదలు పెట్టాను. ఎందుకంటే ఎక్కడో మూడు కిలోమీటర్ల అవతల స్కూల్ లో కొడితే మామూలుగా ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చి ఇంట్లో ఏడవడం మొదలు పెట్టింది.
ఇంకొక గమ్మత్తయిన విషయం చెబుతాను అసలు పద్మజ పేరు' కౌముది'.పాపం ! వాడి చెల్లెలికి ప్రేమగా గొప్పగా మొదలు' కౌముది 'అని పేరు పెట్టాడు. అయితే అది పల్లెటూరు కావటం మూలాన అక్కడ అందరూ ' కౌ - మూతి 'అని పిలవడం మొదలు పెట్టారు. హనుమంతుని తయారు చేయకపోతే కోతి పిల్ల తయారైందట.. అలాగన్నమాట! ఇంకేముంది ,లాభం లేదు, అనుకొని మళ్ళీ ఆ అమ్మాయికి పద్మజ అని పేరు పెట్టారు.
ఆ రోజుల్లో ఇంకా ఆ ఊర్లో కరెంటు రాలేదు. అందరూ కిరోసిన్ లాంతర్లు పెట్టుకుని జీవనం హాయిగా గడిపేవారు. సంధ్యా సమయం అయ్యేసరికి మేము అందరం ఆ లాంతరు లు పట్టుకుని
వాటిని మంచిగా క్లీన్ చేసి అందులో కిరోసిన్ పోసి, కరెక్ట్ గా పెట్టి , ఒత్తులు సరి చేసి పెట్టే వాళ్ళం. రాత్రిపూట భోజనాలయ్యాక ఆరుబయట ఇంటి ముందట నులక మంచాలు వేసుకొని హాయిగా నిద్ర పోయే వాళ్ళం. ఉదయం సూర్యుడు వచ్చి మాకు సర్రున కాలే వరకు ,అలాగే పడుకొనే వాళ్ళము. ఇద్దరం జంటగా కూర్చొని రంగులు పట్టుకొని పెయింటింగ్స్ వేసేవాళ్ళం. ఆ వయసులోనే వాడు తన తెల్ల కాయితం పుస్తకాల మీద కథలు రాసే వాడు. అది చూసి నేనూ రాసేవాణ్ని.
ఇద్దరం కలిసి పరమానంద శిష్యుల కథ రాసుకొని స్క్రిప్ట్ తయారు చేసుకొని, ఇంకో ఏడుగురు స్నేహితులతో
రిహార్సిల్స్ చేయించి ,స్కూల్లో స్టేజి మీద డ్రామా కూడా వేశాం. వాడి నాన్నగారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మంచి హోదాలో ఉండేవారు. మేమిద్దరం చదువులో హేమాహేమీలు గా ఉండేవాళ్ళం.
ఇద్దరం ఫస్ట్ క్లాసు లో పాస్ అయ్యాం. కానీ వాడికి నాలుగు మార్కులు ఎక్కువ వచ్చాయి. వాడి నాన్న ఆరోజుల్లోనే "నా కొడుకు ను డాక్టర్ చేస్తాను, డాక్టర్ చదివిస్తా" అని అందరికీ చెప్పేవారు. వాడు ఆ తర్వాత ఎంబిబిఎస్ చదివి , పీజీ కంటి డాక్టర్ గా చేసి మలేషియాలో సెటిలైపోయాడు. నాకు ఎవరూ డాక్టర్ చేయమని చెప్పలేదు, చేస్తానని నేను- అనలేదు, కాబట్టి నేను మామూలుగా డిగ్రీ చదివి ప్రభుత్వ భీమా ఉద్యోగిగా సెటిల్ అయిపోయాను. కాకపోతే నేను ఉద్యోగం వచ్చిన 22 వ ఏట నుంచి హాయిగా జీవితాన్ని అనుభవించాను,పాపం,వాడేమో దాదాపు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆర్థికంగా కుదురు కోలేదు. వారాంతపు సెలవులకు హైదరాబాద్ కు
వచ్చి సంగీత్ టాకీస్ లో ,ఇంగ్లీష్ సినిమా చూపించి ఆ తర్వాత ఏదైనా హోటల్లో మంచి భోజనం చేయించి ,వాడితో ఒక రోజు కలిపి మళ్లీ నిజాంబాద్ కి వెళ్లి పోయే వాడ్ని. తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ,వాడు రా లేకపోయినా కూడా నేను వాడి తల్లి పక్కనే ఉండి ,ఆమె చనిపోయే వరకూ మాటలు చెప్తూ ధైర్యం చెబుతూ ఉండిపోయాను. వాడి తో గడిపిన మధుర క్షణాలు చాలా చాలా ఉన్నాయి.
స్నేహితులనే వారే లేకపోతే అసలు బాల్యమే-- లేదు ,అసలు బాల్యానికి అర్థం స్నేహం తో గడిపిన జీవితం మాత్రమే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి