నేను --నాకారు ..!!:- ------డా .కె.ఎల్.వి.ప్రసాద్ హన్మ కొండ.
కారంటే -
నాకిష్టం ,
కారుప్రయాణం 
మరింత ఇష్టం !
పుట్టింది 
హైదరాబాద్లో 
తక్షణం 
హన్మకొండకు 
ప్రయాణం ...
కారులోనే మరి !
రిక్షాల్లో -ఆటోల్లో 
ప్రయాణించడం 
ఇష్టముండదు 
ఎందుకో -నాకది 
చాలా కష్టం ...
కారులో తిరగడమే 
చాల ..చాల ..ఇష్టం !
డాడీకి 
డ్రైవింగ్ వచ్చు ...
అమ్మకు డ్రైవింగ్ ,
త్వరలోనే రావొచ్చు !
ఆ..తర్వాత ....
నేనే --
కారునడపవచ్చు !!

 ఫోటోలో...ఆన్షి. నల్లి.