బాలలూ మీకు తెలుసా:-:-మొహమ్మద్ .అఫ్సర వలీషా- ద్వారపూడి తూ గో జి .
తడికి పది సంవత్సరాల వయసులోనే
గణిత శాస్త్రంతో అనుబంధం ఏర్పడింది 
చాలా చిన్న వయసులోనే గణితం పట్ల 
ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనబర్చాడు
పదమూడు సంవత్సరాల కల్లా 
త్రికోణమితి మీద వ్రాసిన 
పుస్తకాలను అవపోసన పట్టాడు
 తనే స్వంతంగా సిధ్ధాంతాలను
రూపొందించిన ఘనుడు 
అందులో ముఖ్యమైన సిధ్ధాంతాలు 
లాండు రామానుజన్ కాన్ స్టంట్ 
మోక్ తీటా ఫంక్షన్స్ 
రామానుజన్ కాన్జెంక్చర్
రామానుజన్ ప్రైమ్
రామానుజన్ సోల్డనర్ కాన్ స్టంట్ 
రామానుజన్ తీటా ఫంక్షన్
రామానుజన్స్ సమ్
రోజర్స్ రామానుజన్ ఐడెంటిటీస్
రామాను

జన్ మాస్టార్ థీరమ్
ఇప్పటికే మీకు అర్థం అయింది అనుకుంటా 
అతనే ప్రపంచ ప్రఖ్యాత మన
గణిత శాస్త్ర వేత్త ఆణిముత్యం 
శ్రీనివాస రామానుజన్ 
ఈరోజు ఆయన వర్ధంతి 
ఈ సందర్భంగా ఆయనకు అర్పిధ్ధాం 
హృదయపూర్వకంగా శ్రధ్ధాంజలి  

కామెంట్‌లు