కన్నీరు:-యడ్ల శ్రీనివాసరావు

 కంటిరెప్పల నుండి కన్నీరు
మదిఅంతరంగం నుండి ప్రేమయు
కొలతకు సవ్యంకాక జాలువారాయి
వాటి రుచి కేవలం ఉప్పదనమే
తెలియక అడిగితిని
కన్నీరంటే ఏమిటని?
బాధకు తురపిరంగియై
మంటల్లో కన్నీరు మరిగి
జాలువారుతుంటే ఉప్పదనం
డబ్బెట్టి కొననిది కన్నీరు
డబ్బెట్టి కొనేది గోళీసోడాయి
మనసు చివ్వుమంటే ఆత్రుత
బంధాలు కలిగేది
అనుబంధాలు పెంచేది
మమతలు రగిల్చేది
మదితెరవబడేది
గుండెనిండా నిప్పులసెగ దించుకునేది
గోళీసోడాకాదు కన్నీరే
కన్నీటికి శూన్యములో
లెక్క ఎక్కువే
ఏడ్చేవార్ని చూచి నవ్వకు
నవ్వేవార్ని చూచి ఏడ్వకు
బ్రతుకు తియ్యని విషాదనావ
బ్రతుకు సంతోషపరిపుస్త్టి త్రొవ
కన్నీరే సుమా...
కామెంట్‌లు