*గొర్రెతల్లి కుక్క*(గేయకథ):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 (నాలుగవ భాగం)
13.
అంతలోనే వచ్చెనంట
మాయదారి రోగమంట
గొర్రెతల్లి చచ్చిపోయె
గొర్రెపిల్ల కుమిలిపోయె !
14.
చచ్చిన తన నేస్తమును
జూచి కుక్క ఏడిచింది
చిన్ని గొర్రెలకు తానే
తల్లి అయ్యి కూరుచుంది !
15.
చిన్ని గొర్రెలకు గూడ
తానె పాలు ఇచ్చినది
తన పిల్లల లాగానె
బహు ప్రేమగ సాకినది !
16.
అదిజూడగ ఊరిజనులు
వరుసగట్టిరి ఆయింటివైపు
ఏమి స్నేహ ధర్మమనిరి
కుక్కతల్లిని ఎంతొపొగడిరి !
(సమాప్తం)
(తేదీ.25-01-2008 నాటి ఈనాడు దినపత్రికలోని సమాచారము ఆధారముగా రచించాను.)

కామెంట్‌లు