ఏకపది:(తెలుపు)
*******
1.శాంతి,సామరస్యానికి చిహ్నమై...స్వచ్ఛంగా కనబడుతుంది!
2.జాతీయ పతాకంలోకెక్కి...మధ్యభాగాన నిలిచింది!
ద్విపది: (నలుపు)
*******
1.బాధకు,నిరసనకు సంకేతమవుతుంది.
భయానికి,విరహానికి తోడవుతుంది.
2.ఉద్యమాల్లో అసంతృప్తికి గుర్తుగా వాడుతారు.
అందానికి కూడా చిహ్నాలుగా కవులు వర్ణించారు.
త్రిపది: (ఎరుపు)
******
1.విప్లవానికి ప్రతీకగా నిలుస్తుంది.
భయపెట్టి,చూపును తన వైపుకు తిప్పుకుంటుంది.
కొన్ని పార్టీలు ఎర్రజెండాలతో చైతన్యపరుస్తారు.
2.స్త్రీల సౌభాగ్యానికి గుర్తుగా కనబడుతుంది.
రక్తం రంగు ఎరుపై కంగారు పెడుతుంది.
దైవపూజల్లో ఎర్రకుంకుమై అగ్రభాగాన ఉంటుంది.
చతుష్పది:(ఆకుపచ్చ)
*********
1.పచ్చని కాపురం అనే నానుడి హాయినిస్తుంది.
పొలాలు పండి పచ్చదనంతో ఆహ్లాదాన్నిస్తాయి.
శుభానికి చిహ్నంగా తోరణాలు పచ్చగా కనిపిస్తాయి.
వైద్యులు ఆకుపచ్చని ఆహారం తినమంటారు.
2.అవనికి హరితహారం అందంగా నిలుస్తుంది.
దారికిరువైపులా పచ్చనిచెట్లు కనువిందు చేస్తాయి.
పచ్చదనమే పరిశుభ్రతకు ఆలవాలమై కనబడుతుంది.
అమ్మవారికి ఆకుపచ్చచీర అలంకారమవుతుంది.
అక్షరమాలికలు:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి