వీరుని కోరిక:- సత్యవాణి

 కాళ్ళుపట్టి ఆపబోకు
కన్నారీ చిన్నితల్లి
కఠినాత్ముడు కాదునాన్న
కర్తవ్యపారాయణుడితడు
దేశమాత పిలుస్తోది
ధీరుడా రారా రమ్మని
కదిలి వెళ్ళాలి నేను
కర్తవ్యం నిర్వహించ
ముష్కరులను దునిమి నేను
మాతృభూమి కాచాలి
కరుణిస్తే ఆదేముడు
కనిపిస్తా నీకుమరల
కాకున్నా నీవెన్నడు
కన్నీరును వొలికించకు
తలఎత్తుకు తెలుపునీవు
తండ్రి వీరయోధుడనీ
అతడి అడుగుజాడలే
ఆదర్శంనాకనచు
తెలుపుమమ్మ చిట్టితల్లి
మలుకొనుము నీబాటను
మాతృభూమి సేవలోనె
మనుమునీవు ఎల్లపుడు
తడ్రి కోరికిదే యనుచు
తలనుంచుము ఏవేళల