గీతా షీల్డ్ !!:-కె. ఎస్. అనంతాచార్య.

 గల గలల గంగాజలాల తెల్లటి నురుగుల  మీద తేలియాడే
హిమ శీతల పవన ఉత్తుంగ తరంగ దృశ్య మాలికల మీదుగా 
 పచ్చని  మామిడి పిందెల రుచి రాజ్యం లో  చేదును మింగే గరళ కంఠునివై
పిండి వెన్నెలను జల్లి  అల్లిన రచనా వల్లిక  నవ వసంత   నవోన్మేష చిత్రమాలిక ! 
ఎంత మధురమో ప్రకృతి కాంత పులకాoకితయై 
మోసుకొచ్చే సువర్ణ సుందర   కవితా మంజూష
భారతి కడుపున ఉదయించిన వేద రాశి జ్ఞాన  పటిమ దిక్కులు పిక్కుటిల్లగ చేసిన రామ శబ్దo  ఓంకారమై  .....
కోకిలల సదస్సు లోని
 కుహు నిర్ణయాల మీద చేసిన సంతకం . 
 సుస్వర జతుల్లోంచి జాతి వారసత్వం గా  కాలమై వచ్చిన రుతు రాజు వసంతుడు! 
రాత్రుళ్ళ మీద  మల్లెల పరిమళాలు చిప్పిల్లగ వచ్చే ఆఘ్రాణ  రసనార్ణవం లోంచి ఉదయించిన పులకాంకుర వైప్లవ్యం  
ఏ బందూకులు తెచ్చిందో బాంధవ్యాలు నిలబెట్టడానికి
 ఏ భాస్వరం  చల్లుతుందో క్రిమి అంతానికి  
ఒక నిశ్శబ్దం లోంచి శబ్దబెది 
విద్యను తెలిసిన రాజులా 
జలస్తంభన సాధించిన రారాజులా 
నిన్నటి క్రీనీడలు నిలువునా చీల్చుకుంటూ
ముసుగుల మీద వాలే విషూచిక కుత్తుక  కత్తిరించుకుంటూ కదిలే ఆయుధం! 
సంగీత గాత్రాలు సరి చేసుకుంటూ భక్తి  భావనా  చైతన్య గీతికల రామనామ సంకీర్తనల కన్నీటితో  హార్మోన్యo మెట్లు తుడుస్తున్నాయి! 
ఇక్కడి గడ్డి లోను నీటిలో గాలిలో అనువణునా   సీతమ్మ తల్లి స్పర్శ రామయ్య తండ్రి పరామర్శ

ఈ నవరాత్రులన్నీ ఒకే నినాదం చేస్తున్నాయి ఇంటి పట్టునుండమని  గుట్టు విప్పి గట్టుమీద పెట్టోద్దని టీకా వేసుకునే మొఖా ఇదే అని ఆర్జిలందిస్తున్నాయి
తస్మాత్ జాగ్రత్త  క్షణ క్షణం  ముఖకవచం తో పాటు
గీతాషీల్డ్  ధరించు  
వాతావరణ కాకను దించే రామ నామం జపించు తారకమై రక్షించు
ఉచ్చ్వా స నిశ్వాసాల్లో ఉటంకించు భారత్ మాతాకీ జై  అని


కామెంట్‌లు