భయపడిన దెయ్యం(బాలసాహిత్యం):- బెల్లంకొండనాగేశ్వరరావు-చెన్నయ్ .


 అమరావతిలో నివశించే బుల్లేయ్య పొరుగు గ్రామంలో నాగేంద్రునిపుట్ట వద్ద తలవెంట్రుకలు తీయడానికి చెవులుకుట్టడానికి వెళ్ళాడు, చేతినిండుగా పని దొరికింది ,ఎంతజాగ్రత్తగా పిల్లలకు గుండుగీసినా చెవులుకుట్టినా చిన్నపాటిగాయాలతో వచ్చే నెత్తురుతో తనచేతిపనిముట్లు చుట్టుకు తీసుకువచ్చిన తెల్లని చేతిగుడ్డ నెత్తుటిమరకలతో నిండింది. సాయంత్రం యింటికి బయలుదేరేముందు నెత్తురు మరకల చేతిగుడ్డలోతన కత్తులు,కత్తెర,అద్దం,నీళ్ళగిన్నే,తదితర వస్తువులు చుట్టుకొని చేతిసంచిలో అవి పెట్టుకుని అడవిమార్గాన తనయింటికి బయలుదేరి పౌర్ణమివెన్నెల వెలుగులో కాలిబాటన వేగంగానడవసాగాడు, కొంతసమయంగడచాక హఠత్తుగా వచ్చినదెయ్యం"ఒరే మనిషి నిన్నుచంపుతానురా"అంది. అదిరిపడ్డ బుల్లేయ్య "నువ్వా హమ్మయ్య గిలిగాడేమో నని భయపడ్డాను నువ్వునన్ను చంపుతావా "అని పెద్దపెట్టుననవ్వసాగాడు. అతనిచెర్యలు అర్దం కానిదెయ్యం "ఓయ్ ఎవడాగిలిగాడు నాకన్నాగొప్పవాడా"అంది, అవును మాఊరివాడే వాడు దెయ్యలను పట్టి నిప్పులపైకాల్చుకుతింటాడు,వాడికంటేనేను ఎంతోనయం పట్టినదెయ్యాన్ని పచ్చిగానే తింటాను"అన్నాడు బుల్లెయ్య.అతనిమాటలు చర్యలుఅర్దకానిదెయ్యం బుల్లెయ్యను చూసిఅయోమయంలోపడింది."ఓదెయ్యమా నువ్వు నన్ను చంపలేవు నేనే నిన్నుచంపగలసమర్దుడను ఈరోజు ఉదయం ఓపిల్ల దెయ్యాన్ని ఫలహరంగా ఆరగించాను ఈరాత్రినాకుటుంబం అందరి ఆకలి తీర్చడానికి భగవంతుడు నిన్ను నావద్దకు పంపించాడు"అని చేతిసంచిలోని నెత్తుటిమరకలలో చుట్టిన తనవస్తువులు వెలుపలకుతీసాడు బుల్లెయ్య."ఏమిటిఅవి"అంది దెయ్యంభయంభయంగా. "చెపుతా అన్నింటికి తొందరపడతావు ఎందుకు "అని అద్దాన్నిచూపిస్తూ "ముందుగా దీంట్లోనిన్ను బంధిస్తాను కావాలంటేచూడు నువ్వుదీనిలోబంధీవిఅయ్యవు"అని అద్దందెయ్యంముందుఉంచాడు .అద్దంలోతనప్రతిబింబాన్ని చూసుకున్నదెయ్యం భయంతో బిగుసుకుపోయింది ,చూసావుగా ఆతరువాత నింపాదిగా ఈకత్తితో నీపీక కోసి ఈగిన్నేలోనికి నీనెత్తురుపట్టితాగుతాను,ఈకత్తెరతో నీమాంసాన్నిగుచ్చుకు పచ్చిగా తింటాను అప్పుడు నానోటికి అంటిన నెత్తురును ఈచేతిగుడ్డతొ తుడుచుకుంటాను, భయపడకు గిలిగాడిలాగా నేనుపట్టినదెయ్యలను హింసించను కాల్చుకుతినను,ఏమిటి నాపై నాసామానులపైన నమ్మకంకుదరలేదా కావాలంటే నా కత్తి పదునుచూడు "అని తమకుదగ్గరగా నిద్రిస్తున్న అడవి పిల్లి తొకను కసుక్కున ఒక్కవేటుతో తెగవేసాడు.లబలబలాడుతూ అడవిలోనికి పరుగు తీసిందిపిల్లి. అదిచూసిన దెయ్యం గజగజవణికిపోతూ "అయ్య నన్నేమిచేయకు మరెప్పుడు మనుషులజోలికిరాను "అందిచేతులుజోడించి.భయపడక నిన్ను చంపితిననులే నాకుఎన్నో మంత్రాలువచ్చు  ముందునిన్నుఈఅద్దంలోబంధించానుకదా యికపైఎప్పుడైనా మనుషులజోలికివస్తే అద్దంలోనుండి నిన్ను వెలుపలకు తీసి చంపుతాను"అయ్యమరెన్నడు మీజోలికిరాను నన్నువదిలేయి "అందిభయంగాదెయ్యం "అప్పుడే వదిలేస్తే ఎలా నేనెంతటివాడినో నీకుతెలియిలిగా"అంటూ కత్తరచేతిలోనికి తీసుకుని దెయ్యం పిర్రపై ఒపోటుపొడిచిడు."చంపాడురాసామి"అంటూఆదెయ్యంఆకాశంలోకి ఎగిరిపోయింది.బ్రతుకుజీవుడాఅనుకుని తనవస్తువులతోయిల్లు చేరాడుబుల్లెయ్య.

బాలలు సమస్యఏదైనా చూడటానికి కొండలాకనిపిస్తుంది  ధైర్యంగా ఢీకొంటే ఎంతటిసమస్య అయినా మీసాహసంముందు తలవంచకతప్పదు .కనుక భయమే మనతొలిశత్రువు అని గుర్తించండి.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం