పోస్ట్ బాక్స్:-- యామిజాల జగదీశ్
పోస్ట్ బాక్స్
బంధాలు దూరమున్నప్పటికీ
ఉల్లాసంగా వారి మధ్య 
సమాచారాలను
మోస్తుంటాయి....

పోస్టల్ శాఖ సిబ్బందితో
తన గుండెలోని సమాచారాలను 
తీయించి
అటూ ఇటూ ఉన్నవారికి
అందించేందుకు
పోస్ట్ బాక్స్ చేసే సేవ
చిరస్మరణీయం

మేమున్న ఇంటికి 
రెండు వీధులవతల 
ఓ స్తంభాన ప్రత్యక్షమైన 
పోస్ట్ బాక్స్ ని 
చూస్తున్నప్పుడల్లా
అనగనగా అన్నట్లు
కొండంత ఉత్సాహంతో
చలంగారికి
సంజీవదేవ్ గారికి
మరెందరో శ్రేయోభీలాషులకూ
ఉత్తరాలు వేసొచ్చిన పోస్ట్ బాక్స్
కళ్ళముందు కదలాడాయి

మనసులోంచి వచ్చిన మాటలతో
అల్లిన ఉత్తరాలకు ప్రత్యుత్తరాలను
అందుకున్నప్పుడల్లా
పోస్ట్ బాక్స్ బంధాల మధ్య వారధిగా
ఉండటాన్ని తలచినప్పుడల్లా 
మనసుకెంత ఆనందమో
మాటల్లో చెప్పలేను

ఉత్తరాలెంత మధురమైనవిగా
ఉండేందుకు కారణం
హృదయాలలోంచి వచ్చే మాటలన్నీ 
నిజమైనవిగా ఉండటమే....

ఉత్తరాలతో వచ్చే 
సంతోషాలు
ఈనాటి ఎస్ఎంఎస్ లో
వాట్సప్ వంటి మాధ్యమాలివ్వలేవన్నదే
నిజం

కొన్నేళ్ళ క్రితం
ఉత్తరాల పర్వానికి
శ్రీకారం చుట్టడానికి
ఒకరిద్దరితో చేసిన ప్రయత్నాలు
విఫలమయ్యాయి

మన మంచిని కోరిని వారే నుంచి
ఈరోజో రేపో తప్పక ఉత్తరం వస్తుందనే
నమ్మకాలతో గడిపిన క్షణాలన్నీ 
ఆనందమయమే

సమాజ శిల్పి
రూపకల్పనలో జీవం పోసుకున్న
రక్తవర్ణ కావ్యానివి నువ్వు
పోస్ట్ బాక్స్ 

నీకిదే నా వందనం!
హృదయపూర్వక అభివందనం!!


కామెంట్‌లు