*అందరికీ*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చక్కనైనా చందాయీ
నా చేతకి అందుతుందా
చల్లనీ వెన్నెలా పరుచుకుందీ
చక్కనీ హాయినీ పెంచుతోందీ
వెన్నెల్లోనా అటపాటలూ
కథలూ కబుర్ల మాటలూ
బాబూపాపల ఆనందాలూ
చిట్టితల్లులా కేరింతాలూ
తాతాబామ్మల సంతోషాలూ
అమ్మానాన్నల తాయీలాలూ
అల్లరిచేస్తే అన్నీ నాకే
అల్లరి మానితె అందరికీ !!