పుత్రకామేష్ఠియాగం(పురాణకథ):-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

 సంతానార్ధం జరిపేయాగాన్ని'పుత్రకామేష్ఠి' 'పుత్రయేష్టి 'అని అంటారు.
సంతానార్ధి అయిన దశరధ మహారాజు తన పురోహితులు,మంత్రులైన సుమంతుడు'సుయజ్ఞుడు,వామదేవుడు,జాబాలి,కశ్యపుడు,వసిష్ఠుడు మెదలగువారిని సమావేశపరచి'మహానుభావులారా నాకూతురు ఋష్యశృంగుని వివాహంచేసుకునివెళ్ళిపోయింది.నావంశోధ్ధారకులైన కుమారులుకావాలి దానికి మార్గంతెలుపండి'అని తనకోరికవెల్లడించాడు.
'మహారాజా గతంలో వేటకువెళ్లిన తమరు పొదలమాటునపారే నీటిప్రవాహంతోపాటు వేరే శబ్ధంకావడంతో 'శబ్ధవేది'అస్త్రాన్ని ఆపొదపై ప్రయోగించారు.తనతల్లితండ్రుల కొరకు నీళ్లు కడవలో ముంచుతున్న మునికుమారుడు మీఅస్త్రం తగిలి మరణించాడు.శోకంతో ఆబాలుడి తల్లి తండ్రులు నువ్వుకూడా మాలాగే పుత్రశోకంతో మరణిస్తావు అని శపించారు.ఆబ్రాహ్మణహత్యమహాపాతకం పోవాలి అంటే ముందు మీరు అశ్వమేధయాగంచేయాలి.అనంతరం పుత్రకామేష్టియాగంజరిపించి సంతానం పొందవచ్చు'అన్నాడు వసిష్టమహర్షి.
'అలానే చేద్దాం పుత్రకామేష్టియాగంజరిపించగల సమర్దులు ఎవరు'అన్నాడు దశరధమహారాజు.'రాజావిభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు.అతని తండ్రి ఆశ్రమానికి వచ్చేమునులను తప్ప స్ర్రీలనేచూడనివాడు.అతనుఉన్నచోట సిరులు ఉంటాయి.నీమిత్రుడు అయిన అంగదేశాధిపతి రోమపాదుడు తనరాజ్యంలో కరువుకాటకాలు సంభవించడంతో,మీకుమార్తే అతనికి పెంపకంఇచ్చి ఉన్న శాంతను అతనికి ఇచ్చి వివాహం జరిపించాడు.ఈవిషయం మీకుతెలి సిందే,ఋష్యశృంగమహర్షి పుత్రకామేష్టి యాగ సమర్దవంతంగా నిర్వహించగలడు'అన్నాడు.వసిష్టమహర్షి.
అందరి సలహామేరకు తొలుత అశ్వమేధయాగం విజయవంతంగా నిర్వహించాడు.అనంతరం ఋష్యశృంగుని సగౌరవంగా ఆహ్వానించి ఆయన అధ్వర్యంలోతనభార్యలైన కౌసల్య,సుమిత్ర,కైకేయి లతో యాగదీక్షబూని పదహారునెలల బ్రహ్మచర్యదీక్షచేపట్టి.భోగభాగ్యాలకు దూరంగా కటిక నేలపై నిద్రిస్తూ,నిత్యం యజ్ఞంచేస్తూ,యజ్ఞప్రసాదాలనే ఆహారంగా స్వీకరిస్తూ, నియమనిష్ఠలతో యాగంచేయసాగాడు.అధర్వణవేదాన్ని అనుసరించి పుత్రకామేష్ఠియాగం చేసేవారు పుత్రులుకావాలి అంటే'పుంసవనమ్ ' మంత్రాన్నిజపిస్తారు.కుమార్తె కావాలి అనుకునేవారు 'స్త్రెషూయామ్'మంత్రాన్నిజపిస్తారు.అలా పుంసవనమ్ మంత్రంతో యాగం పూర్తిచేయబడింది.యజ్ఞపురుషుడు అవతరించి పాయసపాత్రను దశరధునికి అందించి అదృశ్యమైనాడు.దశరధుని భార్యలు ముగ్గురు పాయసం ఆరగించి గర్బవతులైనారు.నెలలు నిండగా,చైత్రమాసం పునర్వసునక్షత్రం నవమి తిధి సాగుతుండగా,గురు,చంద్రులు కర్కాటకంలో ఉచ్ఛస్ధులై ఉండగా కౌశల్య.పుష్యమి నక్షత్రం మీనలగ్నంలో కౌకేయి.ఆశ్లేషానక్షత్రంలో కర్కాటక లగ్నంలో సుమిత్ర  రామ,లక్ష్మణ,భరత శత్రుఘ్నులుజన్మించారు.
అలానే మిథిలా నగరరాజు జనకుడు పుత్రకామేష్టియాగం చేసి యాగశాలలో బంగారు నాగలితో భూమి దున్నుతుండగా మందసంలో సీతాదెవి ని పుత్రికగా పొందాడు.