చిన్నారి సిరిమల్లి
చిరునవ్వుల నాగమల్లి
తుళ్ళింతల జాబిల్లి
కవ్వింతల పాలవెల్లి
ఆట పాటల ఆనందవల్లి
స్వచ్ఛమైన నవ్వుల మరుమల్లి
పరవశాన నీ నవ్వుల్లో తారకలు
జాలువారినేమో నీటి ముత్యాల జల్లులై !
చదువులమ్మ గుడిలో విద్యాసుమమై
ప్రభవించవా నలుదిశలా సుమగంధమై...!
కన్నవారి సంతోషానికి ప్రతిరూపమై
నిలవాలి ఆనంద తీరాల నజరానావై..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి