తాతయ్య కబుర్లు-22. :- ఎన్నవెళ్లి రాజమౌళి


 పిల్లలూ! లాల్ బహుదూర్ శాస్త్రి గారిని వీర బహుదూర్ అని కూడా అన్నారు. ఈ మాజీ ప్రధాని జై జవాన్-జై కిసాన్ అనే గొప్ప నినాదాన్ని ఇచ్చారు. దేహానికి వెన్నుముక రైతు అయినప్పుడు... ఆ దేహమే జవాన్. అన్నం పెట్టేవాడు కిసాన్ అయితే.... అన్నం తిని గుండె మీద చేయి వేసుకుని హాయిగా పండుకుంటున్న మంటే.... కళ్ళల్లో వత్తులు వేసుకుని జవాన్ దేశాన్ని రక్షించడం వలననే... ఒక సందర్భంలో దేశం ఆర్థిక సంక్షోభంలో పడ్డప్పుడు... ఒక పూట ఉపవాసం శరీరానికి ఆరోగ్యం-దేశానికి సౌభాగ్యము అని కూడా నినదించాడు శాస్త్రి. ఆయన ఎంత నిరాడంబరుడు అంటే... ఆయన చనిపోయే వరకు కూడా ఆయనకు ఇల్లులేదు. శాస్త్రి కీర్తిశేషులు అయ్యాక ప్రభుత్వం  ఆ కుటుంబానికి ఇల్లు కట్టించింది. అందుకే ఆయన అంత గొప్ప వ్యక్తి! శక్తి!!

కామెంట్‌లు