మణిపూసలు::-యాడవరం రేవంత్ గౌడ్-7వ తరగతి, సిద్దిపేట-9441762105

1.చెట్లు:

చెట్లను మనం పెంచాలి
వానలు బాగా పడాలి
కరువు రక్కసిని తరుము
విధిగా చెట్లు నాటాలి

2. ఎండలు:

ఎండలు మండుతుoడెను
చెరువు కుంటలు నిండెను
ఎవరికి సాధ్యం కానిది
చంద్రుడే సాధించెను

3.కరోనా:

కరోనా వ్యాధి వచ్చెను
సర్కార్ లాక్ డౌన్ పెట్టెను
కరోనా రావద్దంటే
అందరు ఇంటనె ఉండెను

4.కరోనా టీకా:

కరోనా టీక వచ్చెను
జనంలో భయం మూగెను
విధిగా టీకా వేస్తే
కరోనoత ఖత మాయెను

5.పాలన:

నీతి పాలన కావాలి 
పేదకు మేలు జరగాలి
మంచి నాయకుడి కోసం
అభివృద్ధికి ఓటెయ్యాలి

6.ప్లాస్టిక్:

ప్లాస్టిక్ మనం మానాలి 
పేపర్ జనం వాడాలి
ప్లాస్టిక్ ప్రకృతికి వద్దు
మంచి ప్రకృతే కావాలి


కామెంట్‌లు