నా గాలి పటం:--- కయ్యూరు బాలసుబ్రమణ్యం 7780277240

 ఎగిరింది..ఎగిరింది నా గాలి పటం
పై పైకి ఎగిరింది నా గాలి పటం
పక్షిలా ఎగిరింది నా గాలి పటం
మేఘాలే తాకింది నా గాలి పటం
రాగాలే తీసింది నా గాలి పటం
చుక్కల్ని కలిసింది నా గాలి పటం
చక్కగా నవ్వింది నా గాలి పటం
కొండల్ని దాటింది నా గాలి పటం
పండుగే తెచ్చింది నా గాలి పటం
కోనలను చూసింది నా గాలి పటం
కను విందు చేసింది నా గాలి పటం


  

కామెంట్‌లు