క్రమ శిక్షణ బాటలు
కీర్తి కిరీటపు కోటలు
వారే..వారే..నేటి బాలలు
కోయిల రాగాల గొంతులు
విరిసే పూల చామంతులు
మురిసే నవ్వుల పూ బంతులు
వారే..వారే..నేటి బాలలు
దివిలో వెలిగే చుక్కలు
భువిపై పెరిగే మొక్కలు
భావి భారత దృక్కులు
వారే..వారే..నేటి బాలలు
బడిలో ఒదిగే గువ్వలు
సిరి సిరినాదపు మువ్వలు
ఆకాశాన తారా జువ్వలు
వారే..వారే...నేటి బాలలు
అమ్మ చేతి బువ్వలు
సంద్రం తీరపు గవ్వలు
చెరగని బోసి నవ్వులు
వారే..వారే..నేటి బాలలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి