ఈ కరోనా రక్తచరిత్రలో...:--- పోలయ్య కవి కూకట్లపల్లి--అత్తాపూర్ హైదరాబాద్...9110784502
కంటికి కనిపించని కరోనా
కర్కకషత్వానికి కన్నీళ్ళు
ఇంకి రక్తధారలే శ్రవిస్తున్నాయి
కోటానుకోట్ల కరోనా రోగుల
బంధువుల కనులనుండి
ఆ రక్తాక్షరాలతో లిఖించబడిన 
ఈ కరోనా చరిత్రలో మనం
ముగ్గురిని మాత్రం మరవలేం

ప్రపంచమంతా ప్రళయంలో 
విషవలయంలో చిక్కుకొని 
ఉక్కిరి బిక్కిరౌతున్న వేళ
మృత్యువు విషకౌగిట్లో 
ప్రజలు నలిగిపోయే వేళ
అన్నార్తుల కోసం ఆశతో దీనంగా
ఎందరో రోగులు ఎదురు చూసేవేళ
దిక్కులు పిక్కటిల్లేలా రోదించే వేళ
మందులు దొరక్క
పడకలు లేక ఆక్సిజన్ అందక 
ఆసుపత్రులే శ్మశాన వాటికలైనవేళ
లక్షలు కోట్ల సంపదను ఖాతాలో 
జమ చేసుకున్న అదృష్టవంతుడు
అపరకుబేరుడు అనిల్ అంబానీని...

కంటికి కనిపించక కాలసర్పమై
చాటుమాటుగా‌ కాటు వేస్తూ
మృత్యువులా కనికరమే లేక
అందరినీ కాటికీడ్చుకుపోతూ
శవాలగుట్టలపై చిందులువేస్తూ
శ్మశానవాటికల్లో రోజులతరబడి 
క్యూలో ఉన్న కుళ్ళి పోతూవున్న
శవాలతో విందు చేసుకుంటున్న
విశ్వం పై విరుచుకు పడుతున్న
విర్రవీగుతున్న విధ్వంసం సృష్టిస్తున్న
కరుణ దయ జాలిలేని కరోనా రక్కసిని...

అన్నమో రామచంద్రా 
అంటే నాడు శ్రీరాముడు
ఆదుకున్నాడో లేదోకాని
"అన్నా ఆపద"అంటే 
"భయపడకు నేనున్నానంటు"
ఏ రక్తసంబంధం లేకున్నా 
ఏ ప్రతిఫలం ఆశించకుండా
ఏ అధికారం మందిమార్బలం 
ఎవరి అండదండలు లేకున్నా
గజేంద్ర మోక్షంలో శ్రీహరిలా
పరుగు పరుగున‌ వచ్చి తన
సొంత ఖర్చులతో ఎందరినో
ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న
ఎందరి కన్నీళ్ళనో తుడిచిన
ఆపద్భాంధవుడు అపరదానకర్ణుడు 
అనాధ రక్షకుడు కరుణామయుడు
దయార్ద్రహృదయుడు త్యాగమూర్తి
మానవత్వానికి ప్రతిరూపమైన
దివినుండి దిగివచ్చిన దేవుడు
ప్రత్యక్ష దైవం ఆ సోనూసూద్ ని....

ఓ మహాత్మా! గుడిలేని ఓ దైవమా!
మీరు చల్లగా నిండునూరేళ్ళు వర్థిల్లాలని
ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నా ఆశతో ఆర్ధిస్తున్నా.

(అందరి దేవుడు శ్రీ సోను సూద్ గారు
కర్నూలులో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు
చేయబోతున్న  సందర్బంలో అక్షరాభినందనలు)