దేవతలారా! దీవించండి!--దేవుల్లారా !! రక్షించండి !! ;---పోలయ్య కవి కూకట్లపల్లి--అత్తాపూర్ హైదరాబాద్...9110784502
ఏడుకొండలవాడా ! ఓ వెంకటేశ్వరా !
మీ భక్తులమైన మేము 
మిమ్మును కోరేదొక్కటే...
ఏడుకొండలు ఎక్కలేక...
ఏంచేయాలో దిక్కుతోచక...
మిమ్మల్ని దర్శించుకునే దారిలేక...
129 సంవత్సరాల అనంతరం
మీ గుడికి తాళాలేశానని తెగ
విర్రవీగుతూ మమ్మును వెక్కిరిస్తూ 
గాఢాంధకారంలో ఓ గబ్బిలంలా 
ఆ ఏడుకొండల్లో...కంటికి కనిపించక 
నక్కినక్కితిరిగే ఈ కరోనా రక్కసికి...
గుండుచేసి కొండదేవతకు బలిచ్చేశక్తిని...
మాకు ప్రసాదించండి ఓ పరమేశ్వరా!

కోరిన కోర్కెలుతీర్చే ఓ కోదండ రామా !
మీ భక్తులమైన మేము  
మిమ్మును కోరేదొక్కటే...
నాడు రామబాణమెక్కుపెట్టి 
వాలిని వధించినట్లు
రావణాసురుని పదితలలు నరికినట్లు
మాయలేడిలా...కంటికి కనిపించక 
నక్కినక్కితిరిగే ఈ కరోనా రక్కసిని
తక్షణమే వేటాడి తలనరికి 
అయోధ్యలో కోటగుమ్మానికి
వ్రేలాడదీసే శక్తిని...
మాకు ప్రసాదించండి ఓ పరంధామా!

దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసే ఓ శ్రీకృష్ణా !
మీ భక్తులమైన మేము 
మిమ్మును కోరేదొక్కటే...
కురుక్షేత్రంలో మానసికంగా కృంగిపోయి
అస్త్రసన్యాసం చేసిన అర్జునుడికి 
గీతను బోధించి మీ సుదర్శనచక్రంతో ఆ 
శిశుపాలుని శిరస్సును ఛేదించినట్లు...
కంటికి కనిపించక 
నక్కినక్కితిరిగే ఈ కరోనా రక్కసి
శిరమును చేధించే చిత్రవధచేసే 
అనంతశక్తిని...
మాకు ప్రసాదించండి ఓ క్రిష్ణపరమాత్మా!

ఓ యూదులరాజా ! ఓ యేసురక్షకా ! 
మీ భక్తులమైన మేము 
మిమ్మును కోరేదొక్కటే...
ఎందరో కుంటి, గుడ్డి,చెవిటి,
మూగ,మూర్చ,కుష్టు, 
పక్షవాత రోగులకు స్వస్థత చేకూర్చి
పీడించే దెయ్యాలను తరిమికొట్టినట్లుగా
కంటికి కనిపించక 
నక్కినక్కితిరిగే ఈ కరోనా రక్కసిని...
కలువరిగిరి సాక్షిగా శిలువవేసే సమాధిచేసే అతీంద్రియశక్తిని...
మాకు ప్రసాదించండి ఓ పరలోకపు తండ్రీ!

అందరిని చల్లగా చూసే ఓ అల్లా! 
మీ భక్తులమైన మేము  
మిమ్మును కోరేదొక్కటే...
తాళలిబాన్ ఉన్మాదిలా... 
ఐయస్ఐ ఉగ్రవాదిలా...
ఉగ్రరూపందాల్చి 
అగ్రరాజ్యాలనే అల్లకల్లోలం చేస్తున్న
విశ్వంపై విరుచుకుపడి
విలయతాండవం చేస్తున్న...
కంటికి కనిపించక 
నక్కినక్కితిరిగే ఈ కరోనా రక్కసిని...
రాళ్ళతో కొట్టి మక్కాసాక్షిగా మట్టుపెట్టే
మాంత్రికశక్తిని...
మాకు ప్రసాదించండి ఓ పరమాత్మా!

ఓ ప్రత్యక్ష దైవమా! ఓ ప్రసన్నాంజనేయా !
మీ భక్తులమైన మేము 
మిమ్మును కోరేదొక్కటే...
మీరు నాడు లంకను దహనం చేసి
ఆ సీతమ్మ తల్లిని రక్షించినట్లు‌
కంటికి కనిపించక 
నక్కినక్కితిరిగే ఈ కరోనా రక్కసిని...
కాల్చి బూడిదచేసే కాశిలో అస్థికలు 
కలిపే అఖండ శక్తిని...
మాకు ప్రసాదించండి ఓ వాయునందనా!

విఘ్నాలు తొలగించే ఓ విఘ్నేశ్వరా!
మీ భక్తులమైన మేము 
‌మిమ్మును కోరేదొక్కటే...ఈ 
గండం నుంచి అందరిని గట్టెక్కించమని
కంటికి కనిపించక 
నక్కినక్కితిరిగే ఈ కరోనా రక్కసిని...
అధఃపాతాళానికి అణగద్రొక్కే 
అంతంచేసే శక్తిని...
మాకు ప్రసాదించండి ఓ సిద్ది వినాయకా !


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం