అమ్మ పాట :-డా, గాజులనరసింహ-నాగటూరు గ్రామం-కొనిదేలా పోస్ట్-నందికొట్కూరు మండలం -కర్నూలు జిల్లా-9177071129
పల్లవి:- 

అమ్మ...! తెలుపగలనా..ఒక పాటలో
చెప్పగలనా..ఒక మాటలో...2
అమ్మా  నీ చరిత అఖండ ఘనత 2  "తెలుప ""

చరణం:-1  

ఊహలకే అందని రీతిలో వూపిరినే అందించావు 
జాలే లేని జగతిలో జాగృతిగా నన్ను కాచావు
నీ కడుపునే ఊయలచేసి తొమ్మిదినెల్లు మోసావు 
నా జన్మకు రూపంఇచ్చి  నూ మరో జన్మను పొందావు
వూరటగా వేచి పురిటినొప్పు

ల వేదనతో...అమ్మా...!"తెలుప""

చరణం:-2 

నీ నెత్తుటి ముద్దనే చూసి మురిసి మురిసి ముద్దాదేవు
అడుగడుగులలో అడుగేసి నా అడుగులనే సరిచేసేవు
చేయందించి నడకలో చేయూతగా నిలిచేవు  
ఏ కల్మషంలేని మనసే నీదను నాకు తెలుసమ్మా...
అందుకే చేస్తున్నా వందనం శిరసొంచి వందనం  ..అమ్మా.."తెలుప""


కామెంట్‌లు