భయం: -మమత ఐల-హైదరాబాద్-9247593432


సూక్తి:-- భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే జీవితం మొదలైనట్టు

ఆ.వె
భయము వీడినపుడె రయమున మొదలౌను
జీవి జీవితంబు చిగురు వోలె
భయము తోడ జీవి బ్రతికినా ఫలమేమి
మనసు పెట్టి వినుము మమత మాట

కం
భయమే శత్రువు జీవికి
జయమును సాధించ వచ్చు శౌర్యము తోడన్
భయమును వీడిన క్షణమే
రయమున మొదలౌను బ్రతుకు రక్తిగ మనసా!

ఆ.వె
శత్రువంటి భయము శరవేగమునవీడ
శీఘ్ర గతిన మనిషి జీవితమ్ము
బాట మొదలు పెట్టి బ్రతుకు జాడను చూపు
మనసు పెట్టి వినుము మమత మాట

కం
జీవిత మందున భీతికి
తావీయక సాగు మెపుడు ధైర్యము తోడన్
జీవి భయము వీడినపుడె
జీవన స్థితి మొదలౌను శీఘ్రమె వినుమా! 

కామెంట్‌లు