ఓర్పు:-మమత ఐల-హైదరాబాద్-9247593432


కం
మితమైనోర్పే మేలగు
శృతి దప్పిన నెత్తి నెక్కి శివతాండంబున్
సతతము చేయుదురెల్లరు
మిత సహనము సంతసంబు మృదువుగ బ్రతకన్

ఆ.వె
ఓపికెక్కువైన తాపీగ తలపైన
నెక్కి చిందులేయు చుక్క లందు
మిత సహనము చూప మిక్కిలి మేలౌను 
మనసు పెట్టి వినుము మమత మాట

కం
అతి వోర్పు పరీక్షించుచు
నతిగా తలపైన నెక్కి నాడేరు సుమా
మితముగ సహనంబున్నను
వెతలకు తావే దొరకదు వినుమోమనసా! 

ఆ.వె
మనుజులోర్పు తోడ మనుగడ సాగేను
నేర్పు గలిగినోర్పె నిత్య ఫలము
నమిత సహన మున్న నాడేరు శిరమందు
మనసు పెట్టి వినుము మమత మాట

కామెంట్‌లు